హైదరాబాద్ లో 'ఆర్జీవీ డెన్' .. కొత్త ఆఫీసు వీడియో మీరూ చూసేయండి!
- కొత్త ఆఫీసును ఏర్పాటు చేసుకున్న వర్మ
- తన కార్యాలయాన్ని చూపిస్తూ వీడియో రిలీజ్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
సాధారణంగా ఎవరైనా ఎంత ముచ్చటపడి డిజైన్ చేయించుకున్నా, వచ్చినవారికి మాత్రమే దగ్గరుండి చూపిస్తుంటారు. కానీ వర్మ తన ఆఫీస్ లోని ప్రతి గదిని చూపిస్తూ ఏకంగా ఒక వీడియోను రూపొందించారు. ఒక పాటపై ఆ విజువల్స్ ను కట్ చేసి మరీ సోషల్ మీడియాలో వదిలారు. దాంతో ఇప్పుడు ఈ వీడియో ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది.
వర్మ తన ఆఫీసుకి 'ఆర్జీవీ డెన్' అనే పేరు పెట్టాడు. లోపల తిరుగుతూ ఉంటే .. అడవిలోని గుహల్లో తిరుగుతున్నట్టుగానే ఉంటుంది. అలా మంచి గ్రీనరీ .. చక్కని లైటింగును ఆయన సెట్ చేశారు. తాను ప్రముఖులతో కలిసి దిగిన ఫోటోలు .. బోల్డ్ గా కనిపించే హీరోయిన్స్ పోస్టర్స్ .. సిట్టింగ్ ఏరియాలు .. ఇలా ఆ డెన్ లో చాలానే కనిపిస్తాయి. తన టేస్ట్ కి తగినట్టుగా వర్మ ఏర్పాటు చేసుకున్న ఈ ఆఫీస్ ను, వీడియో ద్వారా చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోవలసిందే.