యూపీలో దారుణం.. గుర్రాలకు ఇచ్చే ఇంజెక్షన్ ఇచ్చి యువతిపై నాలుగు రోజులపాటు అఘాయిత్యం!
- దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపు
- పోలీసులకు ఫిర్యాదు చేసినా తగ్గని నిందితుడు
- ఫోన్ చేసి యాసిడ్ పోస్తానని బెదిరింపు
నాలుగు రోజులపాటు ఆమెను బందీగా ఉంచుకుని పలుమార్లు అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసిన నిందితుడు విషయాన్ని బయటపెడితే వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, చంపేస్తానని బెదిరించి విడిచిపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి రావాలని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా సరే ఏమాత్రం తగ్గని నిందితుడు ఈ నెల 6న వేర్వేరు నంబర్ల నుంచి బాధితురాలికి ఫోన్ చేసి తన మాట వినకుంటే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయి.