హుటాహుటిన ఢిల్లీకి పయనమైన ఈటల.. కీలక పదవి దక్కే ఛాన్స్!
- బీజేపీ పెద్దలతో సమావేశం కానున్న ఈటల
- ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించే అవకాశం
- రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన
ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఈటల సంతృప్తిగా లేరని... పదవి తప్ప, అధికారం లేదని ఆయన భావిస్తున్నట్టు చెపుతున్నారు. రాష్ట్ర స్థాయి పదవిని ఆయన ఆశిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈటలకు రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈటలకు కీలక బాధ్యతలను అప్పగించడంపై రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.