తన పెళ్లి రిసెప్షన్ కు రావాలంటూ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన శర్వానంద్
- ఇటీవల జైపూర్ లో శర్వానంద్ వివాహం
- రక్షితా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేసిన శర్వా
- జూన్ 9న హైదరాబాదులో రిసెప్షన్
ఈ క్రమంలో, శర్వానంద్ నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశాడు. తన పెళ్లి రిసెప్షన్ కు రావాలంటూ ఆయనను స్వయంగా ఆహ్వానించాడు. తన నివాసానికి వచ్చిన శర్వాను సాదరంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్... రిసెప్షన్ కు తప్పకుండా వస్తానని తెలిపారు. వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన శర్వానంద్ కు శుభాకాంక్షలు తెలిపారు.