కర్ణాటకలో ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 30న ఉప ఎన్నిక
- పదవీకాలం ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఎమ్మెల్సీ పదవులకు ముగ్గురి రాజీనామా
- ఈ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ
- 30వ తేదీనే ఓట్ల లెక్కింపు
ఇందులో భాగంగా జూన్ 13న నోటిఫికేషన్, జూన్ 20 వరకు నామినేషన్ల స్వీకరణ, 21న నామినేషన్ల పరిశీలన ఉంటాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువును జూన్ 23గా నిర్ణయించారు. జూన్ 30న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది.