KCR: బీఆర్ఎస్ మానవ వనరుల కేంద్రానికి సీఎం కేసీఆర్ భూమిపూజ

  • హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో నిర్మాణం
  • 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్తుల్లో భవనం
  • పార్టీ నేతలకు శిక్షణ, సంబంధిత కార్యకలాపాల కోసం భవనం
CM KCR puja for BRS institute of excellence and human development centre

బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయనున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ కేంద్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో పదకొండు ఎకరాల విస్తీర్ణంలో పదిహేను అంతస్తుల్లో ఈ మానవ వనరుల కేంద్రాన్ని నిర్మించనున్నారు. పార్టీ నేతలకు శిక్షణ, సంబంధిత కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఈ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్ చండీహోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.

More Telugu News