ఒడిశా రైలు ఘోర ప్రమాదానికి మూల కారణం ఇదే: రైల్వే మంత్రి వైష్ణవ్
- ఎలక్ట్రిక్ ఇంటర్ లాకింగ్లో మార్పే కారణమని గుర్తించామని వెల్లడి
- ప్రమాదంపై దర్యాప్తు పూర్తయ్యిందన్న కేంద్ర మంత్రి
- ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత పూర్తి వివరాలు
ప్రకటిస్తామన్న అశ్విన్
మూడు రైళ్లు ఢీకొన్న ప్రాంతాన్ని ఆదివారం ఉదయం సందర్శించారు. ప్రమాదస్థలంలో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, 1000 మందికిపైగా ఒడిశా కార్మికులు శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. రైల్వే ట్రాకుల పునరుద్ధరణను ఈ రోజే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. బుధవారం ఉదయం నాటికల్లా పనులన్నీ పూర్తి చేసి, ఆ రూట్లో సర్వీసులు పునరుద్ధరణ అవుతాయని పేర్కొన్నారు.