జగన్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ

Balineni Srinivas Reddy meets YS Jagan
  • ప్రకాశం జిల్లాలో విభేదాలకు సంబంధించి సీఎంతో చర్చ
  • టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు ఇతర నేతలకు సంబంధించిన వ్యవహారంపై చర్చ!
  • తాను టిక్కెట్ ఇప్పించిన వారే వివాదాలు సృష్టిస్తున్నారని ఇటీవల ఆవేదన
  • ఈ నేపథ్యంలో జగన్ తో భేటీపై ఆసక్తి
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలకు సంబంధించి సీఎంతో చర్చించారని తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు ఇతర నేతలకు సంబంధించిన వ్యవహారంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. తాను పార్టీ టిక్కెట్లు ఇప్పించిన ఎమ్మెల్యేలే తనపై వివాదాలు సృష్టిస్తూ సీఎంకు ఫిర్యాదు చేస్తున్నారని ఇటీవల మీడియాకెక్కారు. అంతేకాదు, ఆ సందర్భంగా ఆయన కంటతడి కూడా పెట్టారు. ఈ విభేదాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

Go Back to Shorts
Balineni Srinivasa Reddy
YS Jagan

More Telugu News