మే నెలలో 12 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు
- ఈ ఏడాది మే నెలలో రూ.1.57 లక్షల కోట్ల జీఎస్టీ
- 2022 మే నెలలో రూ.1.41 లక్షల కోట్ల జీఎస్టీ
- తాజా జీఎస్టీ వివరాలు వెల్లడించిన కేంద్రం
ఇందులో కేంద్ర జీఎస్టీ వాటా రూ.28,411 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ.35,828 కోట్లు అని వివరించింది. సమీకృత జీఎస్టీ వసూళ్ల విలువ రూ.81,363 కోట్లు (దిగుమతి సుంకం రూ.41,772 కోట్లతో కలిపి) అని, సెస్ రూ.11,489 కోట్లు (దిగుమి సుంకం రూ.1,057 కోట్లతో కలిపి) అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్ లో వసూలైన రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ ఇప్పటివరకు అత్యధికంగా నిలిచింది.