అత్తాకోడళ్ల మధ్య చిచ్చు పెడుతున్న కర్ణాటక ప్రభుత్వ పథకం!
- గృహ లక్ష్మి పేరుతో మహిళలకు నెలనెలా రూ.2 వేల పంపిణీ
- మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ అమలుకు సిద్ధమవుతున్న సర్కారు
- ఈ మొత్తం తమకే చెందుతుందని పలు కుటుంబాల్లో అత్తాకోడళ్ల మధ్య కొట్లాట
అయితే, లబ్దిదారుల ఎంపిక విషయంలో పాటించే నియమనిబంధనలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడం వివాదానికి దారితీసింది. పలు కుటుంబాల్లో గొడవలకు కారణమవుతోంది. ప్రభుత్వం ఇచ్చే నగదు తనకే వస్తుందని అత్తాకోడళ్లు వాదులాడుకుంటున్నారట. దీంతో లబ్దిదారుల ఎంపికపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పీడబ్ల్యూడీ మినిస్టర్ సతీశ్ జార్కిహోలి స్పందిస్తూ.. సంప్రదాయం ప్రకారం కుటుంబంలో మహిళా పెద్దగా అత్తగారు వ్యవహరిస్తారని చెబుతూ ప్రభుత్వం ఇచ్చే నగదు ఆమెకే చెందుతుందని చెప్పారు. కావాలంటే ఆమె తన కోడలుకు ఈ నగదు ఇచ్చుకోవచ్చని స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే కేబినెట్ భేటీలో ఈ విషయంపై స్పష్టత వస్తుందని మంత్రి చెప్పారు.