పుతిన్ తో భేటీ తర్వాత బెలారస్ అధ్యక్షుడికి సీరియస్.. వెంటనే ఆసుపత్రికి తరలింపు
- నాలుగు గోడల మధ్య ఏకాంతంగా భేటీ
- భేటీ ముగిసిన తర్వాత అత్యవసర ఆరోగ్య పరిస్థితి
- వెంటనే ఆసుపత్రికి తరలించడంతో చికిత్స అందిస్తున్న వైద్యులు
రష్యా అధ్యక్ష కార్యాలయం పాత్ర ఉండొచ్చన్న సందేశాలు కూడా వినిపిస్తున్నాయి. లుంక షెంకో ఆరోగ్యం కొన్ని రోజులుగా సమస్యల్లో ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రక్త శుద్ధి తదితర చికిత్సలు చేయిస్తున్నట్టు సమాచారం. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఈ నెల మొదట్లో లుక షెంకో ఓ ట్వీట్ చేశారు. ‘‘నేనేమీ మరణించడం లేదు ఫ్రెండ్స్. నాతో చాలా కాలం పాటు వేగాల్సి ఉంటుంది’’ అని ట్వీట్ చేయడం గమనార్హం.