లండన్ స్ట్రిప్‌క్లబ్‌లో కేఎల్ రాహుల్, అతియాశెట్టి.. నెటిజన్ల ట్రోలింగ్‌పై నటి కౌంటర్.. వీడియో ఇదిగో!
- స్ట్రిప్‌క్లబ్‌లో అతియా, రాహుల్ వీడియో వైరల్
- మరీ దారుణంగా స్ట్రిప్ క్లబ్‌కు వెళ్లడమేంటంటూ నెటిజన్ల ఫైర్
- నిందించేముందు వాస్తవాలు నిర్ధారించుకోవాలని సూచన
సాధారణంగా తాను మౌనాన్నే ఎంచుకుంటానని, కానీ కొన్నిసార్లు మనకోసం మనం నిలబడడం చాలా ముఖ్యమని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అతియా రాసుకొచ్చింది. రాహుల్, తాను, స్నేహితులం కలిసి రెగ్యులర్ ప్లేస్‌కే వెళ్లామని స్పష్టం చేసింది. ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవడం ఆపి, నిందించడానికి ముందు వాస్తవాలను తెలుసుకోవాలని నెటిజన్లకు సూచించింది. ఈ పోస్టు తర్వాత నెటిజన్లు ఆమెకు అండగా నిలబడ్డారు. వారి వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడడం ఆపాలని కోరారు. అయినా, వారు (అతియాశెట్టి, రాహుల్) దీనికి స్పందించాల్సిన పనిలేదని పేర్కొన్నాడు.