Atchannaidu: జగన్ ను వేటాడి, వెంటాడి రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి: అచ్చెన్నాయుడు

Atchannaidu fires on Jagan in Mahanadu
షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ పుట్టి 42 సంవత్సరాలు అయిందని... ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో ఈ మహానాడుకు చాలా ప్రత్యేకత ఉందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాజమండ్రిలో జరుగుతున్న మహానాడులో ఆయన ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి జగన్ పై నిప్పులు చెరిగారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేసి, జైలు జీవితం గడిపిన ఒక దొంగకు ఓట్లు వేసి అధికారాన్ని అప్పగించామని జగన్ ను ఉద్దేశించి విమర్శించారు. 

రాష్ట్రం విడిపోయినప్పుడు లోటు బడ్జెట్ తో ఉన్న ఏపీని... ఐదేళ్లలో చంద్రబాబు అగ్రగామిగా తీర్చిదిద్దారని అన్నారు. అయితే, ఆ విషయాన్ని ప్రజలకు వివరించడంలో ఫెయిల్ అయ్యామని చెప్పారు. జగన్ అనే దుర్మార్గుడు రాష్ట్రమంతా తిరిగి టీడీపీపై తప్పుడు ప్రచారం చేశారని... కానీ ప్రజలు స్పందించలేదని... దీంతో కోడికత్తి డ్రామా ఆడారని... అయినా ప్రజల్లో స్పందన రాలేదని అన్నారు. దీంతో, సొంత బాబాయ్ ని చంపి, ప్రజల సానుభూతితో సీఎం అయ్యాడని మడిపడ్డారు. 

ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ కు మదం ఎక్కిందని, దుర్మార్గమైన ఆలోచనలతో మహిషాసుర పాలన చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ తప్ప మరో రాజకీయ పార్టీ ఉండకూడదనే దుష్ట ఆలోచనతో మనల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తల సహకారంతో, చంద్రబాబు నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించబోతోందని చెప్పారు. జగన్ ను రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ఛీ కొడుతున్నారని అన్నారు. జగన్ ను వెంటాడి, వేటాడి రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Atchannaidu
Telugudesam
TDP Mahanadu

More Telugu News