విద్యా సంస్థల్లో హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేయనున్న సిద్ధరామయ్య ప్రభుత్వం?
- కర్ణాటకలో హిజాబ్ పై నిషేధం విధించిన గత బీజేపీ ప్రభుత్వం
- నిషేధాన్ని ఎత్తివేస్తామని ఎన్నికల సమయంలోనే చెప్పిన డీకే
- మతమార్పిడి చట్టాన్ని కూడా ఎత్తివేసే అవకాశం
తాజాగా మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తి వేస్తామని చెప్పారు. గోవధ, హలాల్ కట్ వంటి చట్టాలను కూడా ఉపసంహరిస్తామని తెలిపారు. మతమార్పిడి నిషేధ చట్టాన్ని కూడా ఉపసంహరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీంతో పాటు కనకపుర టౌన్ సమీపంలోని కపాలబెట్టలో 114 అడుగుల ఎత్తైన ఏసుక్రీస్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే దానిపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.