పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న టీడీపీ
- ఈ నెల 28న నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం
- కార్యక్రమానికి హాజరుకానున్న టీడీపీ ఎంపీలు
- తాను వెళ్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన జగన్
ఇంకోవైపు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి తాను హాజరవుతున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని పార్టీలు కూడా ఈ చారిత్రక కార్యక్రమానికి హాజరు కావాలని జగన్ కోరారు. మరోవైపు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ హాజరవుతుందా? లేదా? అనే విషయంలో ఇంత వరకు క్లారిటీ రాలేదు. ఆ పార్టీ నుంచి ఇంత వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.