మరో కీలక బాధ్యతను చేపట్టనున్న సౌరవ్ గంగూలీ
- త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా గంగూలీ
- ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన దాదా
- నిన్న కోల్ కతాలో గంగూలీని కలిసిన త్రిపుర టూరిజం మినిస్టర్
ఇంకోవైపు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా స్పందిస్తూ... తమ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలనే తమ ప్రతిపాదనను గంగూలీ అంగీకరించడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. గంగూలీ భాగస్వామ్యం కచ్చితంగా త్రిపుర రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపునిస్తుందని అన్నారు. ఈరోజు గంగూలీతో ఫోన్ ద్వారా మాట్లాడానని చెప్పారు.