ఏపీలోనూ కర్ణాటక సీన్.. టీడీపీ విజయం తప్పదు: అచ్చెన్నాయుడు
- కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతే కారణమన్న అచ్చెన్న
- ఏపీలోని అన్ని వర్గాల ప్రజల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న టీడీపీ ఏపీ చీఫ్
- టీడీపీ శ్రేణులను కేసులతో వేధించడం తప్ప ఈ ప్రభుత్వం మరేం చేయట్లేదని ఎద్దేవా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని అన్నారు. టీడీపీ శ్రేణులను కేసులతో వేధించడం తప్ప రాష్ట్రాభివృద్ధిపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టిపెట్టలేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు. జగన్ ప్రభుత్వాన్ని తరిమికొట్టే వరకు విశ్రమించొద్దని కార్యకర్తలకు సూచించారు.