బీజేపీ ఓటమికి ఆ నినాదం బాగా పని చేసింది: సచిన్ పైలట్
- ‘40% కమిషన్ గవర్నమెంట్’ అంటూ కాంగ్రెస్ నినదించిందన్న సచిన్ పైలట్
- ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిందని వ్యాఖ్య
- జనం అంగీకరించి, బీజేపీని ఓడించారని వెల్లడి
జన్ సంఘర్ష్ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సచిన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘40% కమిషన్ గవర్నమెంట్’ అంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నినాదాన్ని కర్ణాటక ప్రజలు అంగీకరించారని సచిన్ పైలట్ అన్నారు. బీజేపీ ఘోర పరాభవానికి ఆ నినాదమే బాగా పనిచేసిందని సచిన్ పైలట్ చెప్పారు. కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీతో కర్ణాటకలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం దేశంలో బీజేపీ పతనానికి నాంది అని పైలట్ అన్నారు.