కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరనేది వారి నిర్ణయమే: డీకే శివకుమార్
- కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన డీకే
- 141 సీట్లు గెలుస్తామని వ్యాఖ్య
- ఎగ్జిట్ పోల్స్ ఏజెన్సీల కంటే తమ సర్వేలో సేకరించి శాంపిల్స్ అధికమన్న శివకుమార్
అసెంబ్లీ ఎన్నికల్లో తాము 141 సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఏజెన్సీల కన్నా తమ సర్వేలో సేకరించిన శాంపిల్స్ సంఖ్య అధికంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి మూలకు వెళ్లానని ఆయన చెప్పారు. ఎన్ని సీట్లు వచ్చినా దాంతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మాత్రం తామేనని బీజేపీ నేతలు చెబుతున్నారని, కానీ అది వారి భ్రమేనని అన్నారు.