Calendar: శ్రీవారి దర్శనం, వసతి గదుల కోటా టికెట్ల క్యాలెండర్ ఇదిగో!

  • ప్రతి నెలా నిర్దిష్ట తేదీల్లో టికెట్ల విడుదల
  • ఆయా తేదీల్లో ఆన్ లైన్ లో బుక్ చేసుకునే సదుపాయం
  • భక్తులకు ఉపయుక్తంగా క్యాలెండర్
TTD releases Tirumala Seva tickets calendar

తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదుల బుకింగ్ తదితర సేవలకు సంబంధించిన ఆన్ లైన్ టికెట్ల విడుదల క్యాలెండర్ ను టీటీడీ నేడు ప్రకటించింది. తిరుమల వెంకన్న భక్తులకు ఈ క్యాలెండర్ ఉపయుక్తంగా ఉండనుంది. అన్ని రకాల టికెట్ల విడుదల తేదీలను ఈ క్యాలెండర్ లో పొందుపరిచారు. 

  • ప్రతి నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్ల విడుదల
  • 21వ తేదీన వర్చువల్ సేవా టికెట్లు, నేరుగా బుక్ చేసుకునే సేవా టికెట్లు విడుదల
  • 23వ తేదీన అంగప్రదక్షిణం, వృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లతో పాటు శ్రీవాణి ట్రస్టు టికెట్లు విడుదల
  • 24వ తేదీన రూ.300 ప్రత్యేక ప్రవేశం దర్శన టికెట్ల విడుదల
  • 25వ తేదీన వసతి గదుల కోటా టికెట్ల విడుదల

More Telugu News