బ్యాట్లకు పనిచెప్పిన లోమ్రోర్, కోహ్లీ, డుప్లెసిస్.... ఆర్సీబీ భారీ స్కోరు
- ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
- 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు
- అర్ధసెంచరీలు సాధించిన లోమ్రోర్, కోహ్లీ
- దూకుడుగా ఆడిన లోమ్రోర్, డుప్లెసిస్
కోహ్లీ 46 బంతుల్లో 5 ఫోర్లతో 55 పరుగులు చేయగా... కెప్టెన్ డుప్లెసిస్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 45 పరుగులు సాధించాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ (0) ఆడిన తొలి బంతికే డకౌట్ అయ్యాడు.
డుప్లెసిస్, మ్యాక్స్ వెల్ వరుస బంతుల్లో అవుట్ కాగా... క్రీజులోకి వచ్చిన లోమ్రోర్ ఐపీఎల్ లో తొలిసారి పూర్తి సాధికారతతో బ్యాటింగ్ చేశాడు. ఈ ఎడమచేతివాటం బ్యాట్స్ మన్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లోమ్రోర్ కు లీగ్ లో ఇదే తొలి అర్ధసెంచరీ.
పెద్దగా ఫాంలో లేని దినేశ్ కార్తీక్ (11) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ మార్ష్ 2, ముఖేశ్ కుమార్ 1, ఖలీల్ అహ్మద్ 1 వికెట్ తీశారు.