ఆయనకు నా మీద చాలా క్రష్ వుండేదనే విషయం మా స్కూల్ మొత్తానికి తెలుసు: క్రికెటర్ అశ్విన్ భార్య

Ashwin had crush on me since school days
  • చిన్నప్పుడు ఇద్దరం ఒకే స్కూల్ కు వెళ్లేవాళ్లమన్న ప్రీతి
  • ఏడో తరగతి నుంచే ఇద్దరం ఒకరికొకరు తెలుసని వెల్లడి
  • క్రికెట్ గ్రౌండ్ కు తీసుకెళ్లి పెళ్లి చేసుకుందామని చెప్పాడన్న ప్రీతి
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ లో సైతం సత్తా చాటుతున్నాడు. దశాబ్ద కాలానికి పైగా తన అద్భుతమైన స్పిన్ ప్రతిభతో భారత్ కు ఎన్నో విజయాలను అందించాడు. మరోవైపు 36 ఏళ్ల అశ్విన్ తన చిన్ననాటి స్నేహితురాలు ప్రీతిని పెళ్లాడాడు. మరోవైపు తమ ప్రేమ, పెళ్లి గురించి ప్రీతి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

జియో సినిమాలో సానియా మీర్జా, వేదా కృష్ణమూర్తి, డానిష్ లు నిర్వహిస్తున్న హ్యాంగౌట్ కార్యక్రమంలో ప్రీతి మాట్లాడుతూ... తాను, అశ్విన్ ఇద్దరూ ఒక స్కూల్ కు వెళ్లేవాళ్లమని తెలిపారు. ఏడో తరగతి నుంచే ఇద్దరం ఒకరికొకరు తెలుసని చెప్పారు. పెరిగి పెద్దయిన తర్వాత కూడా తాము కలుస్తుండేవాళ్లమని తెలిపారు. 

తాను ఈవెంట్స్ కంపెనీలో పని చేసేదాన్నని ప్రీతి చెప్పారు. తనపై అశ్విన్ కు ఎంతో క్రష్ ఉండేదని... ఈ విషయం స్కూల్లో అందరికీ తెలుసని అన్నారు. క్రికెట్ కోసం అశ్విన్ స్కూళ్లు మారేవాడని, అయినప్పటికీ బర్త్ డేలు వంటి కార్యక్రమాల్లో అప్పుడప్పుడు తాము కలుస్తుండేవాళ్లమని చెప్పారు. అశ్విన్ ఏదైనా సూటిగా మాట్లాడతాడని, ఒక రోజు క్రికెట్ గ్రౌండ్ కి తీసుకెళ్లి తన ప్రేమను వెల్లడించాడని... పెళ్లి చేసుకుందామని అడిగాడని తెలిపారు. అలా తమ పెళ్లి జరిగిపోయిందని చెప్పారు.
Advertisement
Ravichandran Ashwin
Wife
Prithi

More Telugu News