ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన కేసీఆర్
- మధ్యాహ్నం 1.05 గంటలకు రిబ్బన్ కట్ చేసిన పార్టీ చీఫ్
- వసంత్ విహార్ లో బీఆర్ఎస్ భవన్ నిర్మాణం
- సుదర్శన హోమం, వాస్తు పూజలలో పాల్గొన్న కేసీఆర్
పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ నేతలు కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు కేశవరావు, వెంకటేశ్ నేత, సంతోష్ కుమార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
2021 సెప్టెంబర్ 2న పార్టీ ఆఫీసు నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ చేశారు. మొత్తం 4 అంతస్తులు, 20 గదులతో 11 వేల చదరపు అడుగుల స్థలంలో దీనిని నిర్మించారు. లోయర్‌గ్రౌండ్‌లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇక గ్రౌండ్‌ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల చాంబర్‌లు, మొదటి అంతస్తులో కేసీఆర్ చాంబర్, కాన్ఫరెన్స్ హాల్స్, 2వ, 3వ అంతస్తుల్లో మొత్తం 20 గదులు ఉన్నాయి.
