Sudheer Babu: 'మామా మశ్చీంద్ర’ లిరికల్ సాంగ్ రిలీజ్!

  • సుధీర్ బాబు హీరోగా 'మామా మశ్చీంద్ర’
  • తొలిసారిగా చేసిన త్రిపాత్రాభినయం
  • హీరోయిన్లుగా ఈషా రెబ్బా - మృణాళిని రవి 
  • సంగీతాన్ని అందించిన చైతన్ భరద్వాజ్ 
Mama Mashcheendra lyriccal song released

మొదటి నుంచి కూడా సుధీర్ బాబు వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తూ వెళుతున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ప్రయోగాలు కొన్ని ఫలించలేదు. అయినా ఆయన మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమా పేరే 'మామా మశ్చీంద్ర'. టైటిల్ బట్టి చూస్తే ఇది కామెడీ ఎంటర్టైనర్ అనే విషయం అర్థమవుతోంది.

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'గాలుల్లోన కలలే వాలే .. కనురెప్పలు దాటే కొత్తగా సరికొత్తగా నీలా మారే' అంటూ ఈ పాట సాగుతోంది. చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా, కపిల్ కపిలన్ - నూతన మోహన్ ఆలపించారు. 

ఈ సినిమాలో సుధీర్ బాబు మూడు విభిన్నమైన పాత్రలను పోషించాడు. డాన్ గా .. డీజేగా .. భారీకాయుడిగా మూడు విలక్షణమైన పాత్రలలో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికలుగా ఈషా రెబ్బా - మృణాళిని రవి అలరించనున్నారు. సునీల్ నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకి, హర్షవర్ధన్ దర్శకత్వం వహించాడు.

More Telugu News