100 కోట్ల క్లబ్ దిశగా 'విరూపాక్ష' .. 8 రోజుల వసూళ్లు ఇవే!

Virupaksha Movie Update
  • ఈ నెల 21వ తేదీన విడుదలైన 'ఏజెంట్'
  • నిన్నటితో 8 రోజులు పూర్తిచేసుకున్న సినిమా 
  • ఈ 8 రోజుల్లో 65 కోట్ల గ్రాస్ వసూలు 
  • త్వరలోనే 100 కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యే ఛాన్స్
సాయితేజ్ హీరోగా రూపొందిన 'విరూపాక్ష' ఈ నెల 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి సుకుమార్ కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. ఆయన స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి, కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. 
 
విడుదల రోజునే ఈ సినిమా అన్ని ప్రాంతాలలోను సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. తొలి రోజునే 12 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, నాలుగు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక నిన్నటితో ఈ సినిమా 8 రోజులను పూర్తిచేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ సినిమా 65 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 

నిన్న విడుదలైన 'ఏజెంట్' ... 'పొన్నియిన్ సెల్వన్ 2' సినిమాలు, 'విరూపాక్ష' వసూళ్లపై ప్రభావం చూపించవచ్చనే టాక్ వచ్చింది. కానీ అలాంటి పరిస్థితులేం కనిపించడం లేదు. త్వరలోనే 'విరూపాక్ష' 100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కథాకథనాలు .. ఫొటోగ్రఫీ .. అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించాయి. 

Advertisement
Saitej
Samyuktha Menon
Sukumar
Virupaksha

More Telugu News