తెలంగాణ గవర్నర్ తమిళసైకి వైఎస్ షర్మిల లేఖ
- టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుకు సంబంధించి లేఖ
- ఐటీ విభాగం పాత్రకు సంబంధించి సిట్ దర్యాఫ్తు మీద నివేదిక కోరాలన్న షర్మిల
- పేపర్ లీకేజీపై షర్మిల ఫైట్
ఇదిలా ఉండగా, టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు 19 మందిని అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్‌కు చెందిన తండ్రీకొడుకులు మైసయ్య, జనార్దన్‌లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొడుకు కోసం రెండు లక్షల రూపాయలు పెట్టి ఏఈ పేపర్‌ను తండ్రి కొనుగోలు చేశారు. దీంతో తండ్రీకొడుకులు ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.