Thummala: రాజకీయాల్లో నా చివరి కోరిక ఇదే: తుమ్మల నాగేశ్వరరావు

This is my last wish in politics says Thummala
షార్ట్స్‌లో చూడండి
ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయడమే రాజకీయాల్లో తన చివరి కోరిక అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీతారామ ప్రాజెక్టుతో తన కోరిక నెరవేరనుందని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాటలో పయనిస్తోందని అన్నారు. జాతీయ రహదారులతో గోదావరి పరీవాహక ప్రాంతంలో రూపు రేఖలు మారబోతున్నాయని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిని చూసి దేశమంతా అలాగే ఉండాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. మణుగూరులో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Thummala
BRS

More Telugu News