భారత్‌లో వరుసగా మూడో రోజూ కరోనా కేసుల్లో తగ్గుదల
- గత 24 గంటల్లో కొత్తగా 6,660 కరోనా కేసుల నమోదు
- మరో 24 మంది మృతి
- మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 63,380
- వెల్లడించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆరోగ్యశాఖ తాజా లెక్కల ప్రకారం, గత 24 గంటల్లో 24 మంది కరోనాతో మరణించారు. వీరిలో కేరళకు చెందిన వారే తొమ్మిది మంది ఉన్నారు. దీంతో, దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,31,369కు చేరుకుంది. ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 0.14 శాతం. రికవరీ రేటు 98.67గా ఉంది.