ఏపీలో నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- తెలంగాణ, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ద్రోణి
- నిన్న రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు
- ఈ నెల 25 వరకు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ
- ఏపీలోని పలు జిల్లాల్లో వడగాల్పులు
మరోవైపు, రాష్ట్రంలోని అనకాపల్లి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లోని పది మండలాల్లో నిన్న వడగాల్పులు వీచాయి. పలు చోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లా కమలాపురంలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.