గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ పార్లమెంటులో ప్రైవేటు బిల్లు
- ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన సీపీఐ సభ్యుడు బినయ్ విశ్వమ్
- గవర్నర్ వ్యవస్థ రద్దు కోసం రాజ్యాంగ సవరణ చేయాలని సూచన
- గవర్నర్ వ్యవస్థతో రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమతౌల్యం దెబ్బతింటోందని వెల్లడి
- ప్రజాస్వామిక ప్రభుత్వాల వ్యవహారాల్లో ప్రజలు ఎన్నుకోని గవర్నర్లు జోక్యం చేసుకోజాలరని వ్యాఖ్య
ఇటీవలి కాలంలో కేంద్రం నియమించిన గవర్నర్లకు, ప్రతిపక్ష పార్టీ పాలిత ప్రభుత్వాలకు మధ్య వివాదాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో గవర్నర్ల తీరుపై ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగ పరుస్తోందంటూ గతంలోనూ అనేక మార్లు ఆరోపణలు వచ్చాయి.