గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుని తాత కేసీఆర్ పాదాలకు నమస్కరించిన హిమాన్షు
- గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న హిమాన్షు
- ఓక్రిడ్జ్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుక
- హాజరైన సీఎం కేసీఆర్, కేటీఆర్, ఇతర కుటుంబ సభ్యులు
12వ తరగతి పూర్తి చేసిన హిమాన్షు ఓక్రిడ్జ్ స్కూల్లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, ఆయన అర్ధాంగి శోభ, కేటీఆర్, ఆయన అర్ధాంగి శైలిమ, కుమార్తె అలేఖ్య కూడా హాజరయ్యారు.
ఇక గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న హిమాన్షు తాత కేసీఆర్ పాదాలకు నమస్కరించడం అందరినీ ఆకట్టుకుంది. మనవడి వినయవిధేయతలకు మురిసిన కేసీఆర్ దీవెనలు అందించారు. ఇక, కేటీఆర్ అయితే పుత్రోత్సాహంతో పొంగిపోయారు.
కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ లో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు హిమాన్షుకు ఈ వేడుకలోనే ఎక్స్ లెన్స్ అవార్డును బహూకరించారు.