రాజకీయాల్లోకి రాకముందు మీ పరిస్థితి ఏమిటో గుర్తుకు తెచ్చుకోండి: పొంగులేటిపై సండ్ర ఫైర్
- ప్రజల కోసం పొంగులేటి చేసిన మంచి పనులు ఏమున్నాయన్న సండ్ర
- పొంగులేటిని ప్రజలు నమ్మరని వ్యాఖ్య
- ఇలాంటి నేతల వల్ల పార్టీలు నాశనం అవుతాయని విమర్శ
ముఖ్యమంత్రి కేసీఆర్ ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నీవు టార్గెట్ చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రెండు జాతీయ పార్టీలు ఆయన కోసం ఎదురు చూస్తున్నాయని పొంగులేటి చెపుతున్నారని... ఆయనే జాతీయ పార్టీల నాయకుల వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. పొంగులేటి వంటి నాయకులతో పార్టీలు నాశనం అవుతాయని విమర్శించారు. రాజకీయాల్లోకి రాకముందు మీ పరిస్థితి ఏమిటో గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు.