అకస్మాత్తుగా పెరుగుతున్న కరోనా కేసులు.. కారణం ఇదే!
- దేశంలో క్రమంగా పెరుగుతున్న రోజువారి కరోనా కేసులు
- కేసుల పెరుగుదలపై ప్రజల్లో ఆందోళన
- కొవిడ్ ఆంక్షల సడలింపు, కొత్త ఉపవేరియంట్ కారణమన్న ఐఎమ్ఏ
- కొత్త వేరియంట్ ప్రమాదకరం కాదని భరోసా
ఇటీవల కేసుల పెరుగుదల వెనుక పలు కారణాలు ఉన్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎమ్ఏ) పేర్కొంది. కొవిడ్ నిబంధనల సడలింపు, కొవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య తగ్గింపు, ఉనికిలోకి వచ్చిన కొత్త కరోనా ఉపవేరియంట్ వెరసి కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయని ఐఎమ్ఏ చెబుతోంది. అంతేకాకుండా, దేశంలో విస్తృతస్థాయిలో టీకాకరణ జరగడంతో ప్రజల్లో కరోనా పోయిందన్న నమ్మకం పెరిగి జాగ్రత్తలు తీసుకోవడం తగ్గిపోయిందని కూడా ఐఎమ్ఏ పేర్కొంది.
ఒమెక్రాన్ ఉపవేరియంట్ అయిన ఎక్స్‌బీబీ.1.16 కారణంగానే ప్రస్తుతం దేశంలో కేసులు పెరుగుతున్నాయని ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ పేర్కొంది. అయితే, ఈ వైరస్ ప్రాణాంతకమైనది కాదని, ఇది ఎప్పటినుంచో ప్రజల మధ్య ఉందని నిపుణులు చెబుతున్నారు.