హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
- హైదరాబాదులో అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు
- నేడు అంబేద్కర్ జయంతి
- హుస్సేన్ సాగరతీరంలో విగ్రహావిష్కరణ
- హెలికాప్టర్ ద్వారా పూలవర్షం
ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మహమూద్ అలీ, పువ్వాడ తదితరులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సమయంలో హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు.