Venkatesh Daggubati: వైజాగ్ లో సెకండ్ షెడ్యూల్ మొదలెట్టిన 'సైంధవ్'

  • వెంకటేశ్ 75వ సినిమాగా 'సైంధవ్'
  • రీసెంట్ గా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి
  • ఈ రోజునే వైజాగ్ లో రెండో షెడ్యూల్ మొదలు 
  • కీలకమైన పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ
  • డిసెంబర్ 22వ తేదీన సినిమా విడుదల  
Saindhav movie update

వెంకటేశ్ అభిమానులంతా ఆయన తాజా చిత్రమైన 'సైంధవ్' గురించిన విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. అందుకు కారణం ఇది వెంకటేశ్ కి 75వ సినిమా కావడమే. సంఖ్యా పరంగా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకోవడంతో, ఈ సినిమాలో కచ్చితంగా కొత్తదనం ఉంటుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. 

నిహారిక బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. 'హిట్ 2' దర్శకుడిగా తన సత్తా చాటుకున్న శైలేశ్ కొలను, ఆ తరువాత సినిమాగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. ఇటీవలే హైదరాబాద్ లో ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకున్న ఈ సినిమా, వైజాగ్ లో సెకండ్ షెడ్యూల్ ను మొదలెట్టింది.

ఈ రోజునే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను, డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News