తనలోని మరో ప్రతిభను ప్రదర్శించిన అనుపమ పరమేశ్వరన్
- సినిమాటోగ్రాఫర్ గా మారిన అనుపమ
- దక్షిణాది భాషల్లో ఆమెకు మంచి డిమాండ్
- కార్తికేయ 2తో బాలీవుడ్ లోనూ అవకాశాలు
సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన ‘ఐ మిస్ యు’ అనే షార్ట్ ఫిల్మ్‌తో డీవోపీగా పరిచయమైంది. ఈ షార్ట్ ఫిల్మ్ 'చాయ్ బిస్కెట్ యూట్యూబ్' ఛానెల్‌లో విడుదల అయ్యింది. డీవోపీగా అనుపమ పేరు చూసి అంతా ఆశ్చర్యపోయారు. అందులో ఆమె కెమెరా పనితనానికి అభినందనలు కూడా వస్తున్నాయి. గతంలో పలువురు హీరోయిన్స్ నటనతో పాటు దర్శకత్వం, సంగీతంలో తమ ప్రతిభ చాటుకున్నారు. అయితే, ఇలా సినిమాటోగ్రాఫర్‌గా మారిన తొలి హీరోయిన్ అనుపమనే కానుంది.