Corona Virus: భారత్‌లో స్వల్పంగా తగ్గిన రోజువారీ కరోనా కేసులు

India records a slight decrease in daily corona cases
షార్ట్స్‌లో చూడండి
గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 5676 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 21 మంది కరోనాకాటుకు బలయ్యారు. అయితే.. సోమవారం నాటి కేసులతో (5880) పోలిస్తే నేడు రోజువారీ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 37,093. ఇప్పటివరకూ దేశంలో మొత్తం 44,200,079 మంది కరోనా కోరల నుంచి బయటపడగా రికవరీ రేటు 98.73 శాతంగా నమోదైంది. ఇక దేశంలో కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ 220.66 కరోనా టీకా డోసుల పంపిణీ జరిగినట్టు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus

More Telugu News