కుటుంబ సమేతంగా లండన్ కు వెళ్తున్న జగన్
- లండన్ లో చదువుకుంటున్న జగన్ కుమార్తె
- కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్తున్న జగన్ దంపతులు
- ఈ నెల 21న బయల్దేరే అవకాశం
ఈ నెల 21న జగన్ దంపతులు లండన్ కు బయల్దేరే అవకాశం ఉంది. వారం రోజుల పాటు వీరు లండన్ లో గడపనున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనది. గత ఏడాది జగన్ కూతురు డిగ్రీ పట్టా పొందారు. ఆ సందర్భంగా జగన్, భారతి లండన్ కు వెళ్లారు. 2019 నుంచి ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలల్లో జగన్ లండన్ వెళుతున్నారు.