పులుల కోసం 97 దేశాల సమాఖ్య.. ప్రారంభించిన ప్రధాని మోదీ
- ఏడు పిల్లి జాతి జంతువుల సంరక్షణకు చర్యలు
- టెక్నాలజీ, సహకారానికి ఈ సమాఖ్య తోడ్పడుతుందన్న ప్రధాని
- ఈ సమాఖ్యకు నేతృత్వం వహించనున్న భారత్
‘‘ఈ కూటమి ఆవశ్యకత ఎంతో ఉంది. టెక్నాలజీ పంచుకోవడం, సహకారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా పెద్ద పిల్లి జాతి జంతువులను కాపాడుకోవచ్చు’’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మైసూరులోని కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీ కన్వొకేషన్ హాల్ లో వన్యప్రాణుల శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈ కూటమికి భారత్ నేతృత్వం వహించనుంది. వేట, చట్టవిరుద్ధమైన వన్యప్రాణుల వ్యాపారం వ్యతిరేకంగా చర్యలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారత్ ఆర్థిక వ్యవస్థకే కాకుండా, పర్యావరణానికీ ప్రాధాన్యం ఇస్తుందన్నారు.