దేశంలో మళ్లీ పంజా విసురుతున్న కరోనా... ఒకే రోజు 14 మంది మృతి
- గత 24 గంటల్లో 5,880 కేసుల నమోదు
- 35,199కి చేరుకున్న యాక్టివ్ కేసులు
- 6.91 శాతంగా ఉన్న డైలీ పాజిటివిటీ రేటు
తాజా కేసులతో కలిపి స్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 35,199కి చేరుకుంది. తాజా మరణాలతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 5,30,979కి చేరింది. ఇప్పటి వరకు 4,47,62,496 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 6.91 శాతంగా ఉంది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.