ఆధార్ కార్డుల జారీపై పరిపూర్ణానందస్వామి కీలక వ్యాఖ్యలు

Swami Paripoornananda Remarks On Aadhar Card
  • హిందువులకు, హిందూ ధర్మాన్ని గౌరవించే వారికే ఆధార్ కార్డులు ఇవ్వాలన్న పరిపూర్ణానంద
  • హిందూ పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకు రావాలని డిమాండ్
  • జగిత్యాలలో చెబితే జగమంతా చెప్పినట్టేనని వ్యాఖ్య
ఆధార్ కార్డుల జారీ విషయంలో పరిపూర్ణానందస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధార్ కార్డులను ఎవరికి పడితే వారికి ఇవ్వకుండా హిందువులు, హిందూ ధర్మాన్ని గౌరవించే వారికి మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగిత్యాలలో నిన్న నిర్వహించిన వీర హనుమాన్ విజయ యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

హిందూ పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్న ఆయన.. హిందువులుగా జీవించే వారికి, హిందువులు కాకున్నా హిందువులను గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులను ఇవ్వాలన్నారు. జగిత్యాలలో చెబితే జగమంతా చెప్పినట్టేనని, అందుకనే ఇక్కడ చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ అంశం దేశవ్యాప్తం కావాలన్నారు.
Go Back to Shorts
Aadhar Card
Swami Paripoornananda
Jagtial

More Telugu News