Nani: 'దసరా' గురించి రాజమౌళి స్పందన ఇదే!

  • క్రితం నెల 30న వచ్చిన 'దసరా'
  • 100 కోట్లకి చేరువవుతున్న సినిమా 
  • ప్రముఖుల నుంచి లభిస్తున్న ప్రశంసలు
  • దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను అభినందించిన రాజమౌళి 
Dasara Movie Update

ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా 'దసరా' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. నాని సరసన నాయికగా కీర్తి సురేశ్ నటించిన ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. క్రితం నెల 30వ తేదీన విడుదలైన ఈ సినిమా, సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా అభిమానుల నుంచి ప్రముఖుల నుంచి ప్రశంసలు తెచ్చిపెడుతోంది. ఈ సినిమా చూసి ప్రభాస్ .. మహేశ్ బాబు వంటివారు అభినందనలు తెలియజేయగా, తాజాగా రాజమౌళి తనదైన శైలిలో స్పందించారు. "నాని - కీర్తి సురేశ్ గొప్పగా పెర్ఫార్మ్ చేశారు. శ్రీకాంత్ ప్రతి సన్నివేశాన్ని హృద్యంగా తెరకెక్కించాడు. పెద్ద హిట్ అందుకున్న టీమ్ కి అభినందనలు" అంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు. 

రాజమౌళి మెచ్చుకున్నారంటే ఆ సినిమాపైకి అందరి దృష్టి మళ్లుతుంది. కంటెంట్ ఉంటేనే తప్ప ఆయన అభినందించరనే నమ్మకం చాలామందిలో ఉంది. అందువలన సహజంగానే 'దసరా' ఫ్లోటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. ధరణి పాత్రలో నాని కనిపించే ఈ సినిమాలో వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్ అలరించనుంది. 

More Telugu News