స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ ఫైనల్లో పీవీ సింధు ఓటమి
- ఇండోనేషియాకు చెందిన టుంజుంగ్ చేతిలో ఓటమి
- వరుస గేముల్లో పరాజయం పాలైన సింధు
- గతంలో ఇరువురి మధ్య ఏడు మ్యాచ్ లు... అన్నింటా సింధుదే విజయం
- ఇవాళ చరిత్ర తిరగరాసిన ఇండోనేషియా షట్లర్
ఈ టైటిల్ పోరులో సింధు ఏ దశలోనూ గెలుపు దిశగా పయనిస్తున్నట్టు కనిపించలేదు. సింధు ఆటతీరులో చురుకుదనం లోపించింది. దాంతో, ఇండోనేషియా షట్లర్ టుంజుంగ్ మరింత విజృంభించింది. సింధుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను ముగించింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు సింధు, టుంజుంగ్ ఏడుసార్లు పరస్పరం తలపడ్డారు. ఈ ఏడు పర్యాయాలూ సింధునే గెలిచింది. ఇవాళ ఫైనల్లోనూ సింధుదే విజయం అని అందరూ భావించారు. కానీ గత రికార్డును పట్టించుకోకుండా టుంజుంగ్ విజృంభించి ఆడింది.