Nani: 'దసరా' సినిమా రెండు రోజుల వసూళ్లు ఇవే!

  • క్రితం నెల 30వ తేదీన విడుదలైన 'దసరా'
  • తొలి రోజునే 38 కోట్లకి పైగా గ్రాస్
  • రెండో రోజుతో 53 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు 
  • వీకెండ్ లో 100 కోట్ల క్లబ్ లోకి చేరే ఛాన్స్   
Dasara Movie Update

మొదటి నుంచి కూడా నానీకి యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ ఉంది. దాంతో ఆయన మాస్ ఆడియన్స్ నుంచి కూడా మంచి మార్కులు కొట్టే అవకాశం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. మాస్ హీరోగా నాని మెప్పించలేడనే విమర్శలను తిప్పికొట్టే కథ కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు

అలాంటి అవకాశం ఆయనకి 'దసరా' సినిమాతో లభించింది. లుక్ పరంగా .. యాస పరంగా .. కథా పరంగా ఈ సినిమా ఆయనలోని మాస్ హీరోను తట్టి లేపింది. మాస్ రోల్ ను నాని ఈ స్థాయిలో చేస్తాడని ఎవరూ గెస్ చేయలేదు కూడా. అంతగా ఆయన ధరణి అనే పాత్రలో ఇమిడిపోయాడు.

క్రితం నెల 30వ తేదీన విడుదలైన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా తొలి రోజునే 38 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. రెండో రోజుతో కలుపుకుంటే 53 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. చూస్తుంటే ఈ వీకెండ్ లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరేలా ఉంది.

More Telugu News