మందుల ధరలను 12 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణం: హరీశ్ రావు
- పేద, మధ్య తరగతికి వ్యతిరేకంగా బీజేపీ పాలన సాగుతోందన్న హరీశ్ రావు
- మందుల ధరలు పెరిగితే సామాన్యులకు మరింత భారం అవుతుందని వ్యాఖ్య
- అవకాశం దొరికినప్పుడల్లా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతున్నారని మండిపాటు
అవకాశం దొరికిన ప్రతిసారీ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడాన్నే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. బీజేపీ చెపుతున్న అమృత్ కాల్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. అచ్చే దిన్ అంటే ఇది కాదని... ఇది సామాన్యుడు సచ్చే దిన్ అని అన్నారు. మన దేశంలో బీజేపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు.