ట్విట్టర్ కు సంబంధించి మరో కీలక ప్రకటన చేసిన ఎలాన్ మస్క్

Elon Musk new announcement on twitter polls
  • ట్విట్టర్ పోల్స్ పై మస్క్ కీలక ప్రకటన
  • పోల్స్ లో పాల్గొనే వారికి బ్లూటిక్ వెరిఫైడ్ అకౌంట్ ఉండాల్సిందేనన్న మస్క్
  • లేకపోతే పోల్స్ లో పాల్గొనే అవకాశం ఉండదని వెల్లడి
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ పోల్స్ లో పాల్గొనాలనుకునే వాళ్లు బ్లూటిక్ ఉన్న వెరిఫైడ్ అకౌంట్లను కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. లేనిపక్షంలో ఏప్రిల్ 15 నుంచి ట్విట్టర్ పోల్స్ లో పాల్గొనే అవకాశం ఉండదని చెప్పారు. ఏప్రిల్ 15 నుంచి వెరిఫైడ్ అకౌంట్లు మాత్రమే ఫర్ యూ రెకమెండేషన్ లో ఉండటానికి అర్హతను పొందుతాయని తెలిపారు. 2022 అక్టోబర్ లో ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి మస్క్ అనేక నిర్ణయాలను తీసుకున్నారు. కంపెనీలో పెద్ద స్థాయిలో ఉద్యోగుల తొలగింపు, బ్లూ టిక్ కోసం డబ్బు వసూళ్లు, గోల్డ్ టిక్ వంటి నిర్ణయాలను ఆయన తీసుకున్నారు.
Go Back to Shorts
Elon Musk
Twitter
blue tick
twitter polls

More Telugu News