Advertisement

'దసరా'కి సిల్క్ స్మిత పోస్టర్ తో ఉన్న సంబంధం ఏమిటి?

Dasara Movie Update
  • శ్రీకాంత్ ఓదెల రూపొందించిన 'దసరా'
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ ఇది
  • ధరణి - వెన్నెల పాత్రల్లో నాని - కీర్తి సురేశ్  
  • కథలో భాగంగా కనిపిస్తూ వస్తున్న సిల్క్ స్మిత పోస్టర్ 
  • ఈ నెల 30న ఐదు భాషల్లో సినిమా విడుదల
నాని హీరోగా రూపొందిన 'దసరా' సినిమా ఈ నెల 30వ తేదీన థియేటర్లకు రానుంది. ఐదు భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. బొగ్గు గనులను ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్న 'వీర్లపాలెం' అనే గ్రామం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
 
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని పక్కా మాస్ లుక్ తో కనిపించనున్నాడు. అదే గ్రామానికి చెందిన 'వెన్నెల' అనే పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ లో సిల్క్ స్మిత పోస్టర్ .. ఆ పోస్టర్ దగ్గరే ఉన్న అరుగుపై 'పవ్వ' సీసా పట్టుకుని కూర్చున్న నాని కనిపిస్తూ వస్తున్నాడు.

సినిమా విడుదల దగ్గర పడుతున్నా, సిల్క్ స్మిత పోస్టర్ నేపథ్యాన్ని మాత్రం దర్శకుడు వదిలిపెట్టలేదు. ఈ సినిమాకీ .. సిల్క్ స్మితకు ఉన్న సంబంధం ఏమిటనే ప్రశ్న నానీకి ఎదురవుతూనే వస్తోంది. ఆయన సస్పెన్స్ లో పెడుతున్నాడు. మా డైరెక్టర్ గారు సిల్క్ స్మితకు పెద్ద ఫ్యాన్ అంటూ దాటవేస్తూనే వచ్చాడు. అందరిలో మాత్రం అందుకు సంబంధించిన ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఈ నెల 30వ తేదీతో ఈ సందేహానికి తెరపడనుంది.

Advertisement
Nani
Keerthi Suresh
Srikanth Odela
Dasara Movie

More Telugu News