Advertisement

మరో రెండు క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా

North Korea test fires two missiles
  • ఇటీవల సంయుక్త విన్యాసాలు చేపట్టిన అమెరికా, దక్షిణ కొరియా
  • మండిపడుతున్న ఉత్తర కొరియా
  • వరుసగా క్షిపణి పరీక్షలతో యుద్ధ సన్నద్ధత
  • నెల రోజుల వ్యవధిలో ఏడు క్షిపణి పరీక్షలు
ఇటీవల తన సరిహద్దుకు సమీపంలో అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టడంపై ఉత్తర కొరియా తీవ్ర ఆగ్రహంతో ఉంది. గత కొన్నివారాలుగా ప్రత్యర్థులను హెచ్చరిస్తూ పలు క్షిపణి పరీక్షలు ముమ్మరం చేసింది. తాజాగా మరో రెండు మిస్సైళ్లను పరీక్షించింది. ఈ నెలలో ఇది ఏడో మిస్సైల్ ప్రయోగం. తూర్పు తీరం దిశగా ప్రయోగించిన ఈ రెండు మిస్సైళ్లు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ కేటగిరీకి చెందినవి. 

ఈ క్షిపణి ప్రయోగాలు జరిగిన విషయాన్ని పొరుగునే ఉన్న దక్షిణ కొరియా నిర్ధారించింది. వీటిని ఉత్తర కొరియా పశ్చిమ భాగం నుంచి ప్రయోగించి ఉంటారని దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది. జపాన్ కోస్ట్ గార్డ్ దళాలు కూడా దీనిపై స్పందించాయి. ఈ రెండు క్షిపణులు జపాన్ ఎకనామిక్ జోన్ కు ఆవల ఉపరితలాన్ని తాకి ఉంటాయని వెల్లడించాయి.
Advertisement
North Korea
Missiles
Test Fire
South Korea
USA

More Telugu News