నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
- దెందులూరు వస్తున్న సీఎం జగన్
- మూడో విడత వైఎస్సార్ ఆసరా నిధుల విడుదల
- రూ.6,419 కోట్లు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి
- 78 లక్షల మందికి లబ్ది
కాగా, ఈ ఉదయం 10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరతారు. 10.30 గంటలకు దెందులూరు చేరుకుని, ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
సీఎం రాక నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక్కడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద హెలిప్యాడ్ రూపొందించారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన సభాస్థలికి చేరుకుంటారు. దెందులూరు సమీపంలోని నేషనల్ హైవే పక్కన బహిరంగ సభ వేదిక ఏర్పాటు చేశారు.