ఓటీటీలో విడుదలైన ఆ వెబ్ సిరీస్‌పై విజయశాంతి ఫైర్
- ‘ఇటీవల ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్’ అంటూ విమర్శలు
- ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సెన్సార్ తప్పనిసరి చేయాలన్న విజయశాంతి
- వెంటనే అలాంటి సీన్లను తొలగించాలని డిమాండ్
- ఉద్యమాల వరకు తెచ్చుకోవద్దని సూచన
ఓటీటీలో ప్రసారమయ్యే చిత్రాల్లోని అసభ్యకరమైన దృశ్యాలను తొలగించి, ప్రజా వ్యతిరేకతకు గురికాకుండా చూసుకోవాలని నటులు, నిర్మాతలను విజయశాంతి కోరారు. మహిళా వ్యతిరేకతతో ఉద్యమాల వరకు తెచ్చుకోవద్దని, ప్రేక్షకుల అభిమానాన్ని కాపాడుకుంటారని భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ పోస్టు షేర్ చేశారు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. విజయశాంతితో తాము ఏకీభవిస్తున్నట్టు చెబుతూ పోస్టులు చేస్తున్నారు.